T20 World Cup Final : ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు, ఊహించని ఫలితాలతో ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చింది టీ20 వరల్డ్ కప్. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. టైట్ బౌలింగ్ మధ్య ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
T20 World Cup Final: తడబడిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ ఫిక్స్ - icc t20 world cup 2022 final venue
T20 World Cup Final : ఊహలకు మించిన కిక్‌ను అందించింది 2022 టీ20 వరల్డ్ కప్. ఎన్నో మలుపులు, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అలా ఫైనల్ వరకు చేరిన పాకిస్థాన్.. ఇంగ్లాండ్ జట్టుకు 138 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
icc t20 world cup 2022 final
కెప్టెన్ బాబర్ అజామ్(32), షాన్ మసూద్(38) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు రిజ్వాన్(15), హారిస్(8), ఇఫ్తికార్ అహ్మద్(0), షాదబ్ ఖాన్(20), మహ్మద్ నవాజ్(5), వాసిమ్ జూనియర్(4), షహీన్ అఫ్రిది(5), హారిస్ రవూఫ్(1) నిరాశపరిచారు. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరగులు చేయగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్లు.. సామ్ కరన్(3) వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్ట్రోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.