పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను(Shoaib Malik news) మళ్లీ టీ20 ప్రపంచకప్ జట్టులో(T20 world cup 2021 pakistan team) చూడటం బాగుందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది సంబరపడ్డాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ముందు పాక్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మక్సూద్ గాయంతో తప్పుకోవడం వల్ల 39 ఏళ్ల మాలిక్‌ను తుది జట్టులో ఎంపిక చేశారు. కాగా, అతడికిది ఆరో టీ20 ప్రపంచకప్(T20 World Cup) కావడం విశేషం. ఈ క్రమంలోనే అఫ్రిది తాజాగా రెండు ట్వీట్లు చేస్తూ.. మాలిక్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో కలిసి ఉండటం మంచిదని అన్నాడు. తన సీనియారిటీతో జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
T20 World Cup: టీ20 జట్టులో షోయబ్ మాలిక్.. ఆనందంలో అఫ్రిది
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టుకు(T20 World Cup) షోయబ్ మాలిక్ ఎంపికయ్యాడు. దీనిపై హర్షం వ్యక్తం చేశాడు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మక్సూద్ గాయంతో తప్పుకోవడం వల్ల 39 ఏళ్ల మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
"టీ20 ప్రపంచకప్ టోర్నీకి వెళ్లే ఆటగాళ్లందరి కోసం నేను మనసారా ప్రార్థిస్తున్నా. నా మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. మీరు బాగా ఆడి జట్టును విజేతగా నిలపండి. మమ్మల్ని అందర్నీ గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నా" అని అఫ్రిది ట్వీట్(Shahid Afridi twit on Pakistan team) చేశాడు. కాగా, మాలిక్(Shoaib Malik cricket records ) 2007లో అరంగేట్రం టీ20 ప్రపంచకప్ నుంచీ ఆ జట్టుతో కొనసాగుతున్నాడు. తొలి టోర్నీలోనే పాకిస్థాన్‌కు సారథ్యం వహించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆపై 2009లో పాక్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2010 టోర్నీలో ఆడలేకపోయిన అతడు గత మూడు టోర్నీల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే మరోసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడబోతున్నాడు. ఇక ఈనెల 24న పాకిస్థాన్ భారత్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్‌కు లైన్ క్లియర్.. టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం