2010లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను(T20 world cup schedule) సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. చివరగా 2016లో జరిగిన టోర్నీ ఫైనల్లో విండీస్ చేతిలో పోరాడి ఓడింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో మార్పులు జరిగాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో(2019 odi world cup winner) ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ ఆర్చర్, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ స్టోక్స్ వివిధ కారణాలతో దూరమయ్యారు. అయినప్పటికీ ఇప్పుడీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. అందుకు ఆ జట్టు బలమైన బ్యాటింగే కారణం. గత కొన్నేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో(international t20 world cup 2021) మోర్గాన్ సేన అత్యంత శక్తిమంతమైన జట్టుగా ఎదిగింది. గత 11 టీ20 సిరీస్‌ల్లో ఆ జట్టు తొమ్మిది నెగ్గింది. ఓ సిరీస్ డ్రా చేసుకుని.. మరో దాంట్లో ఓడింది. కెప్టెన్ మోర్గాన్, బట్లర్, బెయిర్‌స్టో, రాయ్, మలన్.. ఇలాంటి బ్యాటర్లు ఉన్న బ్యాటింగ్ లైనప్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి లివింగ్‌స్టోన్ కూడా జతకావడం వల్ల ఆ జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన మొయిన్ అలీ కూడా జోరుమీదున్నాడు. పేసర్లు మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్, జోర్డాన్, విల్లీతో పాటు నాలుగున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మిల్స్ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. మరి వీళ్లలో తుది జట్టులో ఆడే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక స్పిన్నర్లు రషీద్, అలీ.. వికెట్ల వేటకు సన్నద్ధమయ్యారు. అయితే టీ20 ప్రపంచకప్(t20 world cup venue 2021) జరిగే ఒమన్, యూఏఈలోని స్లో పిచ్‌లు ఇంగ్లాండ్‌కు కఠిన పరీక్ష పెట్టనున్నాయి. ఆ జట్టు టీ20 సిరీస్‌లను ఎక్కువగా ఫ్లాట్ పిచ్‌ల పైనే గెలుచుకుంది. ఈ ఏడాది భారత్‌లో నెమ్మదిగా స్పందించే పిచ్‌లపై జరిగిన సిరీస్‌లో ఓడిపోయింది. ఇటీవల ఐపీఎల్‌లోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మోర్గాన్ ఫామ్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి జట్లతో కలిసి గ్రూప్- 1లో ఉన్న ఇంగ్లాండ్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే సెమీస్ చేరగలదు.
కీలక ఆటగాళ్లు: మోర్గాన్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, రాయ్, మలన్
అత్యుత్తమ ప్రదర్శన: ఛాంపియన్ (2010)
ఇంగ్లాండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, బిల్లింగ్స్, బట్లర్, టామ్ కరన్, జోర్డాన్, లివింగ్‌స్టోన్, మలన్, మిల్స్, రషీద్, రాయ్, విల్లీ, వోక్స్, మార్క్‌వుడ్.
తొలి ముద్దు పెట్టాలని