టీ-20 ప్రపంచకప్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. చాలా జట్లు.. తమ జట్ల కూర్పుపై ఓ అంచనాకు వచ్చుంటాయి. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు.. ఏయే జట్లలో ఎవరెవరు ఉండాలో సూచనలు కూడా ఇస్తున్నారు. టీమ్ఇండియాలో రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలని.. భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెబుతుంటే, కోహ్లీ ఓపెనింగ్ చేయాలని అంటున్నాడు ఆసీస్ మాజీ ప్లేయర్ బ్రాడ్ హాగ్.
ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ-20 సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేసిన కోహ్లీ.. అవసరమైతే ఐపీఎల్, టీ-20 ప్రపంచకప్‌లోనూ తొలుత బ్యాటింగ్‌కు రావడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈ తరుణంలో.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే విరాట్, తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లపై ఒత్తిడి తగ్గిస్తాడని అంచనా వేశాడు హాగ్.
''టీ-20 ప్రపంచకప్‌లో ఇండియాపైనా అంచనాలు ఇవే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలి. మిడిల్ ఆర్డర్లో దూకుడైన ఆటగాళ్లు ఉండాలి. అందుకే కోహ్లీ ఓపెనింగ్ చేయడమే ఉత్తమం'' అనిబ్రాడ్ హాగ్ అన్నాడు.