తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 world cup: కోహ్లీకి సాధ్యంకాని రికార్డు రోహిత్ ఖాతాలో! - mohammad hafeez t20 world cup

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup schedule 2021) భాగంగా అక్టోబర్​ 24(ఆదివారం)న భారత్​-పాకిస్థాన్​ తలపడనున్నాయి(T20 worldcup pakisthan teamindia match). అయితే వరల్డ్​కప్​ తొలి సీజన్​ ఫైనల్​లో తలపడిన ఈ రెండు జట్లలోని ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ​వారెవరు? తొలి ప్రపంచకప్​లో వారి ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం..

rohith sharma
రోహిత్​ శర్మ

By

Published : Oct 23, 2021, 6:29 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021) భాగంగా టీమ్​ఇండియా తమ మ్యాచ్​లను అక్టోబర్​ 24(ఆదివారం) నుంచి ప్రారంభించనుంది. తొలి మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో(teamindia pakisthan match 2021) తలపడనుంది. చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ (pak india match 2021) ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్​ కోసం ప్రపంచంలోని క్రికెట్​ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, 2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్(2007 worldcup final)​..లో తలపడిన పాకిస్థాన్​, భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే తాజా ప్రపంచకప్​లో ఆడుతున్నారు. వారిలో టీమ్​ఇండియా నుంచి రోహిత్​ శర్మ ఒక్కడే ఉండగా.. పాక్​ నుంచి మహ్మద్​ హఫీజ్​, షోయబ్​ మాలిక్​లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రదర్శనను ఓ సారి నెమరువేసుకుందాం.

రోహిత్​ శర్మ

రోహిత్​శర్మ(rohithsharma t20 worldcup).. తన కెరీర్​లో ప్రపంచకప్​లో ఆడే అవకాశాన్ని తొందరగానే అందుకున్నాడు. 2007 తొలి సీజన్​ వరల్డ్​కప్​ ద్వారా తన టీ20 కెరీర్​ ప్రారంభించాడు(2007 t20 world cup rohit sharma runs) . అప్పటికీ పెద్దగా అనుభవం లేని అతడు ఆ టోర్నీ ఫైనల్​లో మంచి ప్రదర్శన చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​ ఉన్నాయి. ఈ మ్యాచ్​లో భారత జట్టు 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ప్రపంచకప్​ సమయానికి అతడు వైస్​కెప్టెన్​, స్టార్​ ఓపెనర్​గా ఎదిగాడు. ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్​గా ఉన్న కోహ్లీకి కూడా టీ20 ప్రపంచకప్​లో ఇంతటి అనుభవం లేదు.

రోహిత్​ శర్మ

మహ్మద్​ హఫీజ్​

పాకిస్థాన్​ సీనియర్​ ఆల్​రౌండర్ మహ్మద్​ హఫీజ్(mohammad hafeez t20 world cup)​ 2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో ఓపెనింగ్​ స్థానంలో ఆడాడు. అయితే ఆ మ్యాచ్​లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. బౌలింగ్​లోనూ అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన ఇతడు 25 పరుగులిచ్చి ఒక్క వికెట్​ కూడా ద్కకించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు జట్టులో కీలక బ్యాట్స్​మన్​గా ఎదిగాడు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్​లో అతడు ఎలా ఆడతాడు అనేది ఆసక్తిగా మారింది.

మహ్మద్​ హఫీజ్​

షోయబ్​ మాలిక్​

2007 టీ20 ప్రపంచకప్​లో(mohammad hafeez t20 world cup) పాకిస్థాన్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు షోయబ్​ మాలిక్​. జట్టును ఫైనల్​కు చేర్చిన అతడు టీమ్​ఇండియా చేతిలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్​లో 17 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఓవర్​ కూడా బౌలింగ్​ చేయలేదు. తాజా వరల్డ్​కప్​లో ముందుగా ప్రకటించిన జట్టులో మాలిక్ పేరు లేదు. ఆ తర్వాత సోహైబ్​ మక్సూద్​కు గాయం కావడం వల్ల షోయబ్​ జట్టులోకి వచ్చాడు. మరి ఇతడు ప్రభావం చూపుతాడో లేదో తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

షోయబ్​ మాలిక్​

ఇదీ చూడండి: T20 World Cup: భారత్-పాక్ పోరు.. టీమ్ఇండియాదే జోరు!

ABOUT THE AUTHOR

...view details