తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐర్లాండ్‌తో టీమ్​ఇండియా అమీతుమీ.. గెలిస్తేనే సెమీస్​కు.. లేకుంటే కష్టమే! - టీ20 మహిళా ప్రపంచకప్​ భారత్​

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం ఐర్లాండ్‌ను ఢీకొనబోతున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది.

t20 women world cup india vs ireland match preview
t20 women world cup india vs ireland match preview

By

Published : Feb 20, 2023, 7:15 AM IST

Updated : Feb 20, 2023, 7:23 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్​ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం ఐర్లాండ్​తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​లో గెలిస్తే ఇతర సమీకరణాలతోనే సంబంధం లేకుండా సెమీస్​కు చేరనుంది. ఒకవేళ ఓడితే వేరే జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమ్​ఇండియా.. ప్రస్తుతం నాలుగు పాయంట్లతో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇంగ్లాండ్​ మూడు మ్యాచులు గెలిచి.. ఆరు పాయింట్లతో సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకుంది. అయితే ఐర్లాండ్​ చేతిలో భారత్​ ఓడి.. ఇంగ్లాండ్​ తన చివరి మ్యాచ్​లో పాక్​ నెగ్గినా కూడా ఆ జట్టే అగ్ర స్థానంలో ఉంటుంది. ఎందుకంటే భారత్​ నెట్​ రన్​రేట్​ తక్కువగా ఉంది.

భారత్​తో సమానంగా నాలుగు పాయింట్లు సాధించిన వెస్టిండీస్​ అమ్మాయిల జట్టు కూడా రన్​రేట్​ తక్కువగా ఉంది. అయితే భారత్​, పాకిస్థాన్​లు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే.. సెమీస్​ బెర్త్​ విండీస్​కు దక్కుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇప్పటికే నాకౌట్‌ రేసుకు దూరమైన ఐర్లాండ్‌ను ఓడించడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. మరి మన అమ్మాయిలు ఏం చేస్తారో వేచి చూడాలి.

కాగా, ఆస్ట్రేలియాతో దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయఢంకా మోగించింది. తద్వారా నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 113 పరుగుల స్వల్ప స్కోరుకే భారత్‌ కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు ఒక్క వికెట్‌ నష్టానికి 61 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌... భారత స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజా ధాటికి విలవిలలాడింది. కేవలం 52 పరుగులు జోడించి మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది.

భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా 7 వికెట్లు, అశ్విన్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్ 43, లబుషేన్ 35 పరుగులు చేశారు. ఆసీస్‌ నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి భారత్‌ ఛేదించింది. భారత బ్యాటర్లలో పుజారా 31 పరుగులతో, భరత్‌ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రోహిత్‌ శర్మ 31, కోహ్లీ 20 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు లయన్ 2, మర్ఫీ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ నిలబెట్టుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌ మార్చి 1 నుంచి ఇందౌర్ వేదికగా ప్రారంభం కానుంది.

Last Updated : Feb 20, 2023, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details