T20 Blast 2023 : ఇంగ్లాండ్ వేదికగా జరగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆదివారం ఎసెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి 37 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. బౌండరీల ద్వారానే నరైన్ 64 పరుగులు సాధించాడు. అతడి విధ్వసంతో సర్రె జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం 196 లక్ష్య ఛేదనలో దిగిన ఎసెక్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ లారెన్స్ (58), మైఖెల్ పెప్పర్ (75) వీరోచితంగా పోరాడిల తమ జట్టుకు విజయాన్ని అందించారు.
లాస్ట్ బాల్‌కు సిక్స్..
ఎసెక్స్ విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 16 పరుగులు కావాల్సివచ్చింది. అయితే వారి విజయం సులువే అనుకున్న తరుణంలో 19వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డన్.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఆరు బంతులకు 8 పరుగులు అవసరమయ్యాయి. 20వ ఓవర్లో మొదటి ఐదు బంతులకు ఐదు పరుగులే వచ్చాయి. దీంతో ఉత్కంఠ పెరిగింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన దశలో ఎసెక్స్ బ్యాటర్ ఫెరోజ్ ఖుషీ అద్భుతమైన సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌లో సర్రె జట్టు ఓడినప్పటికీ అద్భుత ప్రదర్శన చేసిన నరైన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా జూలై 15న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.