తెలంగాణ

telangana

ETV Bharat / sports

సొంత ఊరిలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్న నటరాజన్

Natarajan Cricket Ground: టీమ్​ఇండియా యువ పేసర్​ నటరాజన్​.. జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఓ గుడ్​న్యూస్ చెప్పాడు. సొంత ఊరిలో అన్ని వసతులతో కూడిన క్రికెట్ మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

natarajan
నటరాజన్

By

Published : Dec 16, 2021, 6:14 AM IST

Updated : Dec 16, 2021, 7:33 AM IST

Natarajan Cricket Ground: టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్​ ఆడిన నటరాజన్​.. తర్వాత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఈ సందర్భంగా సొంతూల్లో క్రికెట్ మైదానం ఏర్పాటు చేయాలనే కలను నిజం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు నటరాజన్. దీనికి సంబంధించి ఓ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

భారత్​ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడటంపై హర్షం వ్యక్తం చేసిన నటరాజన్.. తన సొంతూల్లో ఏర్పాటు చేసిన మైదానం పేరు 'నటరాజన్​ క్రికెట్ గ్రౌండ్' అని తెలిపాడు.

"సొంత ఊరిలో అన్ని సౌకర్యాలు ఉండేలా క్రికెట్ మైదానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఈ మైదానానికి నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్​సీజీ) అని పేరు పెడతాం. గతేడాది డిసెంబర్​లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. ఈ ఏడాది డిసెంబర్​లో మైదానం కడుతున్నా." అని ట్విట్టర్ పోస్ట్​లో తెలిపాడు యువ పేసర్ నటరాజన్. కలలు తప్పకుండా నిజమవుతాయని తెలిపాడు. క్రికెట్ మైదానం ఫొటోలను షేర్​ చేశాడు.

ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఆడిన నటరాజన్​ అనేకసార్లు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్ కేన్​ విలియమ్సన్​ కూడా నటరాజన్​పై ప్రశంసలు కురిపించాడు.

భారత్​ తరఫున ఓ టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన నటరాజన్​ 13 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే జరిగిన సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు తరఫున ఆడాడు.

ఇదీ చదవండి:

ముదురుతున్న టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..

Ashes 2nd test 2021: జట్టులోకి అండర్సన్​.. ఇంగ్లాండ్​ టీమ్​ ఇదే

Last Updated : Dec 16, 2021, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details