తెలంగాణ

telangana

ETV Bharat / sports

లీగ్​ నుంచి తప్పుకున్న ఇద్దరు ఆసీస్​ క్రికెటర్లు - జులై 21 నుంచి ది హండ్రెడ్​

'ది హండ్రెడ్​'(The Hundred) లీగ్​ నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్​ వార్నర్(David Warner)​, మార్కస్​ స్టోయినిస్(Marcus Stoinis)​ తప్పుకున్నారు. కరోనా సంక్షోభంలో ప్రయాణ ఆంక్షలు సహా అంతర్జాతీయ టీ20 సిరీస్​ ఆడాల్సిన నేపథ్యంలో వారిద్దరూ టోర్నీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు(ECB) ఓ ప్రకటనలో వెల్లడించింది.

Warner and Stoinis withdraw from The Hundred inaugural season
లీగ్​ నుంచి తప్పుకున్న ఇద్దరు ఆసీస్​ క్రికెటర్లు

By

Published : Jun 11, 2021, 10:37 AM IST

ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు(ECB) త్వరలో నిర్వహించనున్న 'ది హండ్రెడ్'(The Hundred) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్​ వార్నర్(David Warner)​, మార్కస్​ స్టోయినిస్(Marcus Stoinis)​​ తప్పుకున్నారు. కరోనా సమయంలో ప్రయాణ సమస్యలతో పాటు అంతర్జాతీయ టీ20 సిరీస్​లు ఉన్న కారణంగా వారిద్దరూ టోర్నీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ నుంచి తప్పుకున్న వీరిద్దరూ సదరన్​ బ్రేవ్(Southern Brave)​ అనే టీమ్​కు చెందినవాళ్లే కావడం విశేషం. ​

"డేవిడ్​ వార్నర్​, మార్కస్​ స్టోయినిస్​ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు టోర్నీకి దూరమవ్వడం చాలా నిరాశ కలిగించింది. కానీ, కొవిడ్​ సంక్షోభంలో సవాళ్లు, ఆంక్షలను విదేశీ ఆటగాళ్లు అధిగమించడం కష్టమనే విషయాన్ని మేము గ్రహించాం. ఈ నేపథ్యంలో సదరన్​ బ్రేవ్​ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపిక జరుగుతుంది. ఏది ఏమైన అనుకున్న సమయానికి టోర్నీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి".

- ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు

'ది హండ్రెడ్'​ ఆరంభ టోర్నీలో పురుషులతో పాటు మహిళా టీమ్​లూ ఆడనున్నాయి. మహిళల టోర్నీలో ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్​ కౌర్​, జెమియా రోడ్రిగ్స్​, దీప్తి శర్మ ఈ టోర్నీలో ఆడనున్నారు.

టీ20 ఫార్మాట్​లో అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్న షెఫాలీ వర్మ.. సోఫీ డెవిన్ అనే న్యూజిలాండ్​ క్రికెటర్​ స్థానంలో బర్మింగ్​హామ్​ ఫీనిక్స్​ జట్టులో ఆడనుంది. జులై 21న జరగనున్న టోర్నీ ఆరంభమ్యాచ్​లో కియా ఓవల్​ టీమ్​పై మాంచెస్టర్​ ఒరిజినల్స్​ జట్టులో హర్మన్​ప్రీత్​ ఆడనుంది. మరోవైపు నార్తరన్​ సూపర్​ఛార్జర్స్​ జట్టుకు జెమియా రోడ్రిగ్స్, సదరన్​ బ్రేవ్​ టీమ్​కు స్మృతి మంధాన, హీథర్​ నైట్​ జట్టుకు దీప్తి శర్మ​ ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇదీ చూడండి..Racism in Cricket: మోకాళ్లపై సంఘీభావం తెలిపితే సరిపోదు!

ABOUT THE AUTHOR

...view details