న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు (nz vs ind t20 series 2021) టీమ్ఇండియా సర్వం సిద్ధం అయింది. నేడు(నవంబర్ 17) సాయంత్రం మొదటి మ్యాచ్ జైపూర్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇండియన్ టీ20 చరిత్రలో కొత్త శకానికి ఆరంభం కానుంది. టీమ్ఇండియాకు రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. 9 ఏళ్ల క్రితం ఇదే జైపూర్‌లో ముంబయి తరఫున రంజీ ట్రోఫీకి రోహిత్ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో 'టీమ్‌ను లీడ్ చేయబోతున్నాను' అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తొమ్మిదేళ్ల క్రితం ముంబయి తరపున రంజీ ట్రోఫీకి (rohit sharma as captain in t20) రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. జైపూర్‌లోని కేఎల్ సైనీ మైదానమే అందుకు వేదికైంది. ప్రస్తుతం టీమ్ఇండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇదే జైపూర్‌లో ఆడటం విశేషం.