టీ20 ప్రపంచకప్ (t20 world cup 2021) అర్హత పోటీలు పూర్తయ్యాయి. గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు అర్హత సాధించగా.. గ్రూప్-బీ నుంచి స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్-12 దశకు చేరుకున్నాయి. దీంతో శనివారం (అక్టోబర్ 23) నుంచి ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఈ మెగా ఈవెంట్‌లో ఏ రోజు ఏయే జట్టుతో పోటీపడనుందో స్పష్టత వచ్చింది.
T20 World cup: టీమ్‌ఇండియా ఏ రోజు ఏ జట్టుతో ఆడనుందంటే?
టీ20 ప్రపంచకప్‌నకు (t20 world cup 2021) సర్వం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 23) నుంచి మ్యాచ్‌లు ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఈ టోర్నీలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?
టీమ్‌ఇండియా షెడ్యూల్
తొలుత ఆదివారం చిరకాల ప్రాత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో కోహ్లీసేన ఢీకొననుంది. ఆ తర్వాత ఈనెల 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్థాన్‌తో, 5న స్కాట్లాండ్‌తో, 8న నమీబియాతో తలపడనుంది. ఇక తొలి సెమీఫైనల్ 10వ తేదీన, రెండో సమీస్ 11న, ఫైనల్ 14న జరగనున్నాయి. అయితే, టీమ్‌ఇండియా సూపర్-12లో పాక్, న్యూజిలాండ్ జట్లను ఓడిస్తే కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ (t20 world cup 2021 team india schedule) ఇక్కడ చూడండి.