టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో టీమ్ఇండియా దుమ్ములేపింది. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే.. ఈ వార్మప్ మ్యాచులు జట్టు ఫామ్ నిర్ధారించడానికి ప్రమాణం కాదని భారత మాజీ క్రికెటర్(T20 world cup 2021) యువరాజ్ సింగ్ అన్నాడు. కానీ ఆటగాళ్లు వ్యక్తిగతంగా అంచనా వేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పాడు. అయినప్పటికీ టీమ్ఇండియా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. రెండో టీ20 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకునే(T20 world cup latest news) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియా మొత్తం రాణిస్తేనే విజయం సాధ్యం. కానీ టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కేవలం ఐదు ఓవర్లలో ఆట దూరమైపోయే అవకాశాలుంటాయి. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను టీమ్ఇండియా పోలి ఉంది. టైలెండర్లు కూడా బ్యాటింగ్ చేయగలరు. జడేజా, హార్దిక్, రిషభ్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. యూఏఈ గ్రౌండ్స్‌పై కూడా మన జట్టుకు అవగాహన ఉంది. అక్కడి మైదానాలు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి"
-యువరాజ్ సింగ్, భారత మాజీ ఆల్‌రౌండర్