టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి, సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తేలిపోయింది. దీంతో 18.2 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్(24), మెహదీ హాసన్ (27) మినహా అందరూ విఫలమయ్యారు. రబాడా, నోర్జే తలో మూడు వికెట్లు తీశారు.