ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ తండ్రయ్యాడు. అతడి భార్య.. అక్టోబర్ 8న పండంటి మగబిడ్డకు(Pat Cummins child) జన్మనిచ్చింది. ఆ శిశువుకు అల్బీ బోస్టన్ కమిన్స్ అని పేరు పెట్టారు. అయితే.. అదే రోజు కమిన్స్ క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. టీ-20 ప్రపంచకప్ కోసం దుబాయ్ బయలుదేరిన ఆసీస్ బృందంలో కమిన్స్ కూడా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో.. తన భార్య గర్భధారణ నుంచి శిశువు జననం వరకు కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే ఇంటికి వెళ్లిన కమిన్స్.. అప్పటినుంచి కుటుంబంతోనే గడిపాడు.