తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS PAK: పంత్ ఒంటిచేతి సిక్స్​లు.. ఊర్వశి చీర్స్..! - టీ20 ప్రపంచకప్ తాజా వార్తలు

ఆదివారం పాక్​తో జరిగిన మ్యాచ్​లో (T20 World Cup 2021 news) పంత్​ ఒంటి చేతి సిక్స్​లతో స్టేడియంను హోరెత్తించాడు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చీర్స్ చెబుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. పంత్, రౌతేలా డేటింగ్​లో ఉన్నట్లు గతంలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.

T20 World Cup 2021
ఊర్వశి రౌతేలా చీర్స్

By

Published : Oct 25, 2021, 12:00 PM IST

Updated : Oct 25, 2021, 12:54 PM IST

ఆదివారం జరిగిన భారత్​- పాక్ (T20 World Cup 2021 news) మ్యాచ్​లో రిషభ్ పంత్ ఒంటిచేతి సిక్స్​లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రేక్షకులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. అదే సమయంలో స్టేడియంలోనే ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా టీమ్​ఇండియాను సపోర్ట్ చేస్తూ ఫోజులు ఇచ్చింది. అయితే.. పంత్​, ఊర్వశి రౌతేలా డేటింగ్​లో ఉన్నట్లు గతంలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో మళ్లీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఊర్వశి రౌతేలా చీర్స్

భారత్​- పాకిస్థాన్ మ్యాచ్​లో (ind vs pak match latest news) మొదట బరిలోకి దిగిన కోహ్లీ సేన మొదట్లోనే తప్పటడుగులు వేసింది. ఒకరి వెంట మరొకరు అవుట్ అయ్యారు. అయితే.. పంత్(30) క్రీజులో ఉండగా.. అభిమానుల్లో ఉత్సాహం నిండింది. నత్తనడకగా ఉన్న భారత స్కోర్​ బోర్డ్​ పంత్ రాకతో పరుగులు పెట్టింది. హసన్​ అలీ బౌలింగ్​లో ఒక్క చేత్తో వరుసగా రెండు సిక్స్​లు బాదాడు పంత్.​ మొత్తంగా టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లేమీ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది పాక్.

ఇదీ చదవండి:IND VS PAK: పాక్​ జట్టుపై కోహ్లీ సరికొత్త రికార్డ్​

Last Updated : Oct 25, 2021, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details