ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup) పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకొని.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు 15మందితో కూడిన జట్టును(India T20 World Cup Squad) సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే గాయం బారిన పడిన వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కోలుకోగా.. మరోవైపు ధావన్‌ను జట్టులోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ధావన్‌కు ఛాన్స్ దక్కేనా?
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా.. మూడో బ్యాటింగ్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఐసీసీ ఈవెంట్లలో శిఖర్ ధావన్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఈ నేపథ్యంలో ధావన్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ధావన్‌ను ఓపెనర్‌గా.. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉంది. అయితే, ఇటీవల కాలంలో ధావన్ ఫిట్‌గా లేడని.. అతడి స్థానంలో పృథ్వీషా ఎంపిక బాగుంటుందని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కోలుకుంటేనే జట్టులో స్థానం!
చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. టీ20 ప్రపంచకప్ నాటికి కోలుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సుందర్ కోలుకోగడని బీసీసీఐ వైద్య బృందం సూచిస్తే.. అతడిని జట్టులోకి ఎంపిక చేయొచ్చు.
సుందర్ స్థానంలో మరొకరిని భర్తీ చేయడం సెలెక్టర్లకు పెద్ద తలపోటుగా మారింది. ఒకవేళ సుందర్ స్థానంలో అశ్విన్‌ను ఎంపిక చేయాలని అనుకున్నా.. అతడు టీ20ల్లో ఆడి చాలా కాలమైంది. ఒకవేళ అశ్విన్‌ను పక్కన పెడితే.. సుందర్ స్థానంలో జయంత్ యాదవ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. అశ్విన్, జయంత్ యాదవ్‌లు కాకుండా ఫామ్‌లో ఉన్న మరొక ఆఫ్ స్పిన్నర్ లేరు.
ఈ ఏడాది ఇంగ్లాండ్, శ్రీలంకలతో సిరీస్‌లలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే.. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ పోటీ పడొచ్చు.