దేశవాళీ లీగ్ 'సయ్యద్ ముస్తాక్ అలీ' టీ20 టోర్నీ నుంచి ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు కర్ణాటక, బరోడా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి.
1)కర్ణాటక Vs జమ్ము కశ్మీర్ (గ్రూప్-ఏ)
తొలి మ్యాచ్‌లో జమ్ముకశ్మీర్‌పై 43 పరుగుల తేడాతో కర్ణాటక గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కశ్మీర్ జట్టు 107 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ 18 పరుగులే చేసి ఔటయ్యాడు.
2) బరోడా Vs ఉత్తరాఖండ్ (గ్రూప్-సీ)
ఉత్తరాఖండ్‌పై 5 పరుగుల తేడాతో బరోడా విజయం సాధించింది. బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్య(76) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బరోడా 168 పరుగులు చేయగా, ఉత్తరాఖండ్ 163 పరుగులే చేసి ఓడింది.