భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న (IND vs NZ t20 series 2021) మూడు టీ20ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా నేడే తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌గా, రెగ్యులర్ టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు. వీరిద్దరూ కలిసి జట్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళతారనేదానిపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ స్వభావాలు ఒకే రకంగా ఉంటాయని, వారి మధ్య సమన్వయం బాగుంటుందని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు.
"రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో అతడు (ద్రవిడ్) క్రీజులో (rohit vs rahul dravid) ఉన్నంత వరకు భారత బ్యాటింగ్‌కు ఢోకాలేదని భావించేవాళ్లం. ప్రధాన కోచ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న అతడిని నేను నమ్మడానికి అదే కారణం. ద్రవిడ్ కోచ్‌గా విజయవంతమవుతాడని నమ్ముతున్నాను. ద్రవిడ్, రోహిత్ స్వభావాలు ఒకేలా ఉంటాయి. ద్రవిడ్‌లాగే రోహిత్ కూడా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి, వారి మధ్య సమన్వయం బాగుంటుందని భావిస్తున్నా. ఎందుకంటే వారిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు" అని సునీల్ గావాస్కర్ అన్నారు.