తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బిగ్​బాష్' నుంచి స్మిత్ ఔట్.. వార్నర్​, కమిన్స్ కూడా! - IPL SMITH

బిగ్​బాష్ లీగ్ రాబోయే సీజన్​లో ఆడడం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్ సూచన ప్రాయంగా వెల్లడించాడు. ఇతడి బాటలోనే స్టార్ ఆటగాళ్లు వార్నర్, కమిన్స్ వెళ్లేలా కనిపిస్తున్నారు.

Steve Smith says 'no chance' of playing Big Bash
ఆసీస్ క్రికెటర్ స్మిత్

By

Published : Oct 30, 2020, 5:51 PM IST

ఐపీఎల్​లో ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఈసారి బిగ్​బాష్ లీగ్​లో పాల్గొనట్లేదని చెప్పాడు. చాలారోజుల నుంచి బయో బబుల్​లో ఉన్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇతడితో పాటే వార్నర్, కమిన్స్​ కూడా బిగ్​బాష్​ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

"బబుల్​లో ఆడటం ఇది ప్రారంభ దశ మాత్రమే. ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. కానీ ఇందులో కొంచెం ఇబ్బందిగా ఉంది. మానసిక ఒత్తిడి నుంచి ఆటగాళ్లు బయటపడాలంటే కొన్నాళ్ల పాటు సాధారణ జీవితాన్ని గడపాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది" అని స్మిత్ చెప్పాడు.

ఆగస్టులో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా.. అది పూర్తవగానే ఐపీఎల్​ కోసం యూఏఈలో అడుగుపెట్టింది. దీని తర్వాత స్వదేశంలో టీమ్​ఇండియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్​లను ఆడనుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు బయో సెక్యూర్​ వాతావరణంలోనే ఈ మ్యాచ్​లను నిర్వహించనున్నారు. ఆ తర్వాత బిగ్​ బాష్ లీగ్ జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details