భారత్‌కు ఏకపక్ష విజయం (IND VS PAK match) అప్పగించాలని చెప్పిన టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై పాక్ మాజీ బౌలర్ అక్తర్ విరుచుకుపడ్డాడు. అందుకు తాము సిద్ధంగా లేమని అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ జట్టు అద్వితీయ విజయం సాధించిన అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశాడు.
"భారత్‌కు ఏకపక్ష విజయం అప్పగించాలా భజ్జీ? మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని అర్థం అయిందా? ఇప్పుడేం చేస్తావ్.. ప్రశాంతంగా ఉండు.. ఈ రోజును ఆస్వాదించు"