ఐసీసీ ప్రపంచకప్‌ల్లో (T20 world cup 2021) పాకిస్థాన్‌పై ఓటమి ఎరుగని టీమ్ఇండియాకు షాక్ తగిలింది. యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్‌లోని తమ తొలి (pak vs india match) మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఓ టీ20 మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి కాగా.. పొట్టి ఫార్మాట్లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం కూడా పాక్‌కు ఇదే తొలిసారి. ఇవన్నీ పక్కన పెడితే అసలు టీమ్ఇండియా ఓటమి కారణాలేంటి అనేది ఓసారి పరిశీలిద్దాం..!
- 2016 నుంచి దుబాయ్‌లో అన్ని టీ20ల్లోనూ పాక్ విజయం సాధించింది. ఆ విషయం పాక్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి.
- ఈ మ్యాచ్‌లో టాస్ కూడా టీమ్ఇండియాకు ప్రతికూలంగా మారిందనే చెప్పాలి.
- పాక్ టాస్ గెలవడం వల్ల బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్ తేమ ప్రభావం వల్ల టీమ్ఇండియా బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
- అలానే భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ(57), పంత్(39) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్ అందరూ చేతులెత్తేశారు.
- భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం. అది ఉండటం వల్ల మన బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పాక్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడారు. ఇదీ టీమ్ఇండియా ఓటమికి ఓ కారణం కావొచ్చు.
- స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 11 పరుగులే చేసి ఔటయ్యాడు.
- లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయలేకపోయారు భారత బౌలర్లు. ఒకవేళ తీసుంటే ఆ జట్టుపై ఒత్తిడి పెరిగేదేమో!
- పాకిస్థాన్‌పై గెలిచిన ఎనిమిది టీ20ల్లోనూ ధోనీనే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 'ధోనీ మార్క్' మిస్ కావడం కూడా ఓటమికి కారణం కావొచ్చు.
- కోహ్లీకి కెప్టెన్‌గా ఈ ఫార్మాట్లో ఇదే చివరి టోర్నీ. అందువల్ల అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతడు బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందుంటే గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.