తెలంగాణ

telangana

ETV Bharat / sports

kohli retirement news: రిటైర్మెంట్​పై విమర్శలకు కోహ్లీ కౌంటర్​

తన రిటైర్మెంట్​(kohli retirement updates) పట్ల వస్తున్న విమర్శలను భారత జట్టు కెప్టెన్​ విరాట్ కోహ్లీ సాఫ్ట్​గా తిప్పికొట్టాడు. కొందరు అనవసర విషయాలను తవ్వుకుంటూ కూర్చుంటారని విమర్శించాడు.

kohli retirement news
విరాట్ కోహ్లీ రిటైర్​మెంట్​

By

Published : Oct 24, 2021, 7:58 AM IST

టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(virat kohli steps down as indian captain) తప్పుకోనున్నాడు. టీ20 ప్రపంచ కప్‌(t20 world cup 2021 india team) తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. ఇకపై టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలపై ఎక్కువగా దృష్టిపెడతానని అతడు చెప్పాడు. పొట్టి క్రికెట్​లో బ్యాటర్​గా రాణిస్తానని చెప్పాడు. ఈ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు. వచ్చే ఏడాది(2022)లో టీ20 వరల్డ్​ కప్ షెడ్యూల్​ ఉన్న నేపథ్యంలో కోహ్లీ తన రిటైర్మెంట్​​పై తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై విరాట్ స్పందించాడు. కొందరు జరగని విషయాలను తవ్వుకుంటూ కూర్చుంటారని అన్నాడు. అక్టోబర్​ 24న పాక్​తో మ్యాచ్​కు ముందు జరిగిన కాన్ఫరెన్స్​లో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"మ్యాచ్​ ముందు రిటైర్మెంట్​పై స్పందించడం ఇష్టం లేదు. నేను ఇప్పటికే వివరంగా చెప్పాను. దానిపై ఇంకా చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ప్రపంచకప్​పైనే మా దృష్టి ఉంది. కొందరు లేని విషయాలను ముందేసుకుని తవ్వుకుంటూ కూర్చుంటారు. అలాంటివారి వ్యాఖ్యలపై నేను స్పందించను. రిటైర్మెంట్​​పై ఇంకా చర్చించాలనుకుంటే అలాంటివారి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తాను"

-విరాట్ కోహ్లీ

కోహ్లీ రిటైర్మెంట్​​పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల స్పందించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం కోహ్లీదేనని, బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని​ గంగూలీ అన్నాడు.

ఇదీ చదవండి:ganguly on kohli captaincy: కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం

ABOUT THE AUTHOR

...view details