తాను తప్పుకొంటే జట్టుకు ప్రయోజనం ఉందని అనిపిస్తే(T20 world cup 2021) ఆ పని చేస్తానని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(eoin morgan t20 world cup) అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ సాధిస్తుందనుకుంటే జట్టుకు అడ్డుగా ఉండాలనుకోట్లేదని చెప్పాడు. టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు ఈ మేరకు స్పందించాడు.
"నేను పరుగులు చేయడంలో వెనకబడ్డాను. ఫామ్ కోల్పోయిన ప్రతిసారి బయటపడందే నేను ఈ స్థాయిలో ఉండను. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతాను. టీమ్ కష్టసమయంలో ఉన్నప్పుడే బ్యాటింగ్ చేయడం నాకు ఇష్టం. నా కెప్టెన్సీ బాగుంది. అవసరమైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. టీమ్‌కు ప్రయోజనం అనుకుంటే తప్పకుండా టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటాను"
-మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్