ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అవేశ్ ఖాన్. కాగా, ఇతడి ఫేవరేట్ ప్లేయర్ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌ను కలవడం కోసం ఎంతోకాలంగా ఎదురుచూసిన అవేశ్.. ముంబయితో మ్యాచ్ ముగిసిన తర్వాత తన కోరిక తీర్చుకున్నాడు. రోహిత్‌ను కలిసి జెర్సీపై తన సంతకం తీసుకున్నాడు. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది దిల్లీ ఫ్రాంఛైజీ.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా మిగతావారు అతడికి మద్దతుగా నిలవలేకపోయారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. ధావన్ (45), స్మిత్ (33) రాణించారు.