ఐసీసీ బుధవారం(నవంబర్ 17) టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC T20 Rankings 2021) విడుదల చేసింది. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మళ్లీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా అగ్రస్థానంలోనే ఉన్నాడు. రాహుల్ ఒక స్థానం దిగజారి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ఏకంగా ఎనిమిది స్థానాలను ఎగబాకి 33వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ICC rankings t20: కోహ్లీ మళ్లీ అదే స్థానంలో.. మెరుగైన వార్నర్ - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లేటెస్ట్ న్యూస్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం(నవంబర్ 17) టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC T20 Rankings 2021) ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్