తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలవాలంటే భారత జట్టుకు నిద్రమాత్రలు ఇవ్వండి: అక్తర్​ - భారత్​- పాక్ మ్యాచ్

భారత జట్టుపై గెలవాలంటే (T20 world cup 2021) టీమ్​ఇండియాకు నిద్రమాత్రలు ఇవ్వండని పాక్ జట్టుకు హాస్యాస్పదంగా సలహా ఇచ్చాడు షోయబ్ అక్తర్. కోహ్లీని ఇన్​స్టాగ్రామ్​ వాడకుండా, మెంటార్ ధోనీ బ్యాట్​ పట్టుకోకుండా చూసుకోండని సూచించాడు.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్ 2021

By

Published : Oct 24, 2021, 1:51 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021) భారత్​-పాక్​ జట్లు అక్టోబర్ 24 సాయంత్రం బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో షోయబ్ అక్తర్, హాస్యభరిత సలహాను (india vs pakistan match) పాకిస్థాన్ జట్టుకు ఇచ్చాడు. భారత్​పై గెలవాలంటే మ్యాచ్​కు ముందు టీమ్​ఇండియా ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని సూచించాడు. మెంటార్​ ధోనీని బ్యాట్​ పట్టుకోకుండా చూసుకోవాలని పాక్ జట్టుకు చెప్పాడు.

"భారత్​పై గెలవాలంటే పాక్​కు మూడు సలహాలు ఇస్తున్నాను. టీమ్​ఇండియాకు నిద్రమాత్రలు ఇవ్వండి. రెండోది.. రెండు రోజులపాటు విరాట్​ కోహ్లీని ఇన్​స్టాగ్రామ్​ ఉపయోగించుకుండా అడ్డుపడండి. మూడు.. మెంటార్​ ధోనీ బ్యాట్​ పట్టుకోకుండా చూసుకోండి"

-షోయబ్ అక్తర్, పాక్ మాజీ బౌలర్

ఆదివారం జరగబోయే మ్యాచ్​లో పాక్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని తమ జట్టుకు సూచించాడు అక్తర్. డాట్ బాల్స్​ లేకుండా చూసుకోవాలని చెప్పాడు. 5-6 ఓవర్ల వరకు బాల్​ టూ బాల్​ రన్​ రేట్​ కాపాడుకోవాలని సూచించాడు. మంచి లక్ష్యాన్ని భారత్​ ముందు ఉంచితే.. బౌలింగ్​లో విరుచుకుపడి, సులభంగా వికెట్లు తీయవచ్చని పేర్కొన్నాడు.

ఫైనల్​ మ్యాచ్​లో భారత జట్టు తమ ఆటగాళ్ల జాబితాను ఇంకా ప్రకటించలేదు. దీంతో.. మ్యాచ్​లో ఆడబోయే భారత జట్టులో ఈ క్రింది ప్లేయర్స్ ఉండొచ్చని అంచనా వేశాడు అక్తర్.

ఇదీ చదవండి:Ind vs pak T20: దాయాదుల పోరు- అభిమానుల పూజలు, హోమాలు

ABOUT THE AUTHOR

...view details