సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(syed mushtaq ali trophy 2021) టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఎడమచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ (5/8) విజృంభించడం వల్ల చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 29 పరుగుల తేడాతో ఉత్తర్‌ప్రదేశ్(hyderabad vs uttar pradesh live)పై నెగ్గింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచిన హైదరాబాద్ 20 పాయింట్లతో గ్రూపు-ఇలో అగ్రస్థానం కైవసం చేసుకుని నాకౌట్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్లకు 147 పరుగులు సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (62; 46 బంతుల్లో 7×4, 1×6) మరో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. 3.2 ఓవర్లు వేసిన మిలింద్ కేవలం 8 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
హైదరాబాద్ ఆటగాళ్లే టాప్