Syed Mushtaq Ali Birthday :క్రికెట్లో ఐసీసీతో పాటు దేశీయంగా అనేక టోర్నమెంట్లు జరుగుతుంటాయి. అనేక భారత మంది ప్లేయర్లు డొమెస్టిక్ లీగ్‌ల్లో రాణించి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత పేరుగాంచిన డొమెస్టిక్ లీగ్‌ల్లో 'సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీ' ఒకటి. ఈ టోర్నీ ఎందరో మంది ప్లేయర్లకు తమ ప్రతిభ చాటుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతోంది. అయితే భారత్ వెటరన్ ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ పేరిట 2006 నుంచి బీసీసీఐ ప్రతి సంవత్సరం ఈ టోర్నీ నిర్వహిస్తోంది. మరి ఈ సయ్యద్ అలీ ఎవరు? అతడి ఘనతలేంటి? అతడి బర్త్‌డే సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
భారత దిగ్గజ ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ 90's లో టీమ్ఇండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. 1934లో కెరీర్ ప్రారంభించిన అలీ దాదాపు 18 ఏళ్లపాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దూకుడుతో కూడిన తన బ్యాటింగ్ శైలితో యంగ్ ప్లేయర్లకు అలీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్లో అనేక రికార్డులు సాధించిన సయ్యద్ ముస్తాక్ అలీ, టెస్టుల్లో భారత్ నెగ్గిన తొలి మ్యాచ్‌లో జట్టు సభ్యుడిగాను ఉన్నాడు.
తొలి భారతీయుడిగా : విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు సయ్యద్ అలీ. 1936లో ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టుపై శతకం బాది రికార్డు కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అలీ సాధించిన 112 స్కోర్ కారణంగానే టీమ్ఇండియా ఆ మ్యాచ్‌ను డ్రా గా ముగించింది. అంతేకాకుండా అప్పట్లో విదేశీ పిచ్‌లను అర్థం చేసుకొని, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల బ్యాటర్లలో అలీ ఒకడు.
బౌలర్ నుంచి టాపార్డర్‌కు : అయితే అలీ స్పిన్నర్‌గా కెరీర్ ప్రారంభించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసే అలీ కెరీర్ తొలినాళ్లలో 7స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అయితే ఓ సిరీస్‌లో టీమ్ఇండియా రెగ్యులర్ ఓపెనర్ దిలావర్ హుస్సేన్ గైర్హాజరీలో అలీకి టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అలీ స్టార్ బ్యాటర్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత విజయ్ హరారేతో కలిసి జట్టుకు అనేక విజయవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నిర్మించాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్లో అన్‌స్టాపబుల్ : ఫస్ట్ క్లాస్ కెరీర్లో అలీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతడు 226 మ్యాచ్‌లో 13213 పరుగులు చేశాడు. బంతితోనూ అదరగొట్టిన అలీ 162 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ కెరీర్లో 11 టెస్టుల్లో అలీ 612 పరుగులు.