Surya Kumar Yadav Kane Williamson: సొంత గడ్డపై కివీస్ జట్టును టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూర్య ఇన్నింగ్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గెలుపుకోసం తాము మరింత కృషి చేయాల్సిందని తెలిపాడు.
సూర్య ఆడిన ఆ షాట్లు నెవ్వర్ బిఫోర్ అంతే!: కేన్ మామ - సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్
మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన విభిన్నమైన షాట్లతో న్యూజిలాండ్‌పై అదరగొట్టేశాడు. శతకం సాధించి భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఏమన్నాడంటే?
"మేం ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. సూర్య ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం. నేను చూసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటి. కానీ అతడు ఆడిన కొన్ని షాట్లు మాత్రం ఇంతకు ముందెన్నడూ నేను చూడలేదు. మళ్లీ అదే మాట చెప్తున్నాను. అతడి ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. అత్యద్భుతమైన ప్రదర్శన చేశాడు. మేం బంతితోనే కాదు, బ్యాట్‌తో సైతం ఆకట్టుకోలేకపోయాం" అంటూ కేన్ వివరించాడు.
టీమ్ఇండియా నిర్దేశించిన 192 భారీ పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఛేదించలేకపోయింది. కేన్ 52 బంతుల్లో 61 పరుగులు చేసినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు రాణించలేకపోయారు. దీంతో ఆ జట్టు18.5 ఓవర్లకు 126 పరుగులతోనే సరిపెట్టింది. న్యూజిలాండ్‌తో మంగళవారం చివరి మ్యాచ్ జరగనుంది.