తెలంగాణ

telangana

ETV Bharat / sports

బరిలో దిగాడంటే ఇక సెంచరీలే.. అదీ సూర్యకుమార్​ యాదవ్​ లెక్క! - టీ 20 ప్రపంచ కప్​లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్కోర్​

పొట్టి కప్పు పోటీల్లో జరిగిన హోరాహోరీ పోరులో టీమ్​ ఇండియా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన ప్రతిభతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఆడిన ప్రతి మ్యాచుల్లో బాల్​ను బౌండరీ దాటించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అలా ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్​ ఆడిన కొన్ని షాట్లు చూసి షాకవ్వడం విశ్లేషకుల వంతు అయ్యింది. మరి సూర్యకుమార్ చేసిన టాప్​ స్కోర్​ అప్డేట్స్​ను ఓ సారి లుక్కేద్దామా..

surya kumar yadav top scores in t20 world cup
surya kumar yadav top scores in t20 world cup

By

Published : Dec 20, 2022, 7:23 PM IST

Surya Kumar Yadav : పొట్టి కప్పు పోటీల్లో ఈ ఏడాది జరిగిన అన్నీ మ్యాచ్​లు అభిమానుల్లో ఉత్కంఠ రేపేలా ఉన్నాయి. ఒక దాన్ని మించి మరొకటి అలా కనువిందు చేశాయి అనడం అతిశయోక్తి కాదేమో. అలా 2022లో జరిగిన ఆసియా కప్‌, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో టీమ్​ ఇండియా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన ప్రతిభతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఆడిన ప్రతి మ్యాచుల్లో బాల్​ను బౌండరీ దాటించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అలా ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్​ ఆడిన కొన్ని షాట్లు చూసి షాకవ్వడం విశ్లేషకుల వంతు అయ్యింది.

2022లో 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్‌ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. వాటిలో రెండు సెంచరీలు, 9 ఆఫ్​ సెంచరీలు ఉన్నాయి. అలా క్రీజులో విజృంభించిన ఈ ఏస్​ ప్లేయర్​ సూర్యకుమార్‌ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల(1164)తో పాటు అత్యధిక సిక్సర్లు (98) బాదిన ప్లేయర్​గా కొనసాగుతున్నాడు. మొత్తం మీద 42 టీ20లు ఆడిన 'స్కై'.. 44 సగటున, 181 స్ట్రయిక్‌ రేట్‌తో 1408 పరుగులు చేశాడు. అలా తన టీ20 కెరీర్‌లో 2 సెంచరీలు..12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇవే కాకుం‍డా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులతో పాటు మరెన్నో రివార్డులను సొంతం చేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన కొద్ది సమయంలోనే స్టార్​గా ఎదిగిన స్కై.. టీమ్​ఇండియాలో మంచి ప్లేయర్​గా పేరు తెచ్చుకున్నాడు.

'స్కై' టాప్​ స్కోర్స్​ ఇవే..

  • వెస్టిండీస్‌తో 7 టీ20ల్లో 179.25 స్ట్రయిక్‌ రేట్‌తో 242 పరుగులు చేశాడు.
  • శ్రీలంకతో ఆడిన టీ20లో 117.24 స్ట్రయిక్‌ రేట్‌తో 34 పరుగులు చేశాడు.
  • సౌతాఫ్రికాతో 4 టీ20ల్లో అదరగొట్టిన స్కై 185.14 స్ట్రయిక్‌ రేట్‌తో 187 పరుగులు చేశాడు.
  • ఐర్లాండ్‌తో 2 టీ20లు పోటీపడిన సూర్యకుమార్​.. 250 స్ట్రయిక్‌ రేట్‌తో 15 పరుగులు చేశాడు.
  • ఇంగ్లండ్‌తో జరిగిన 4 టీ20ల్లో 180.14 స్ట్రయిక్‌ రేట్‌తో 185 పరుగులు చేశాడు.
  • ఆస్ట్రేలియాతో 3 టీ20లు 185.48 స్ట్రయిక్‌ రేట్‌తో 115 స్కోర్​.
  • న్యూజిలాండ్‌తో 2 టీ20లకు 124 పరుగులు చేశాడు సూర్యకుమార్​.
  • బంగ్లాదేశ్‌తో ఆడిన టీ20లో 185.50 స్ట్రయిక్‌ రేట్‌తో 30 పరుగులు.
  • అఫ్గానిస్థాన్‌ టీ20లో 300 స్ట్రయిక్‌ రేట్‌తో 6 పరుగులు తీశాడు.
  • హాంగ్‌కాంగ్‌తో ఆడిన టీ20లో 261.53 స్ట్రయిక్‌ రేట్‌తో 63 పరుగులు స్కోర్​ చేశాడు.
  • నెదర్లాండ్స్‌తో ఓ టీ20 ఆడిన స్కై 204 స్ట్రయిక్‌ రేట్‌తో 51 పరుగులు సాధించాడు.
  • పాకిస్థాన్​తో జరిగిన 3 టీ20ల్లో 123.91 స్ట్రయిక్‌ రేట్‌తో 46 పరుగుల స్కోర్​.
  • జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్‌ రేట్‌తో 61 పరుగులు చేశాడు.

ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఆరు 6 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్​.. మైదానంలో 189.68 స్ట్రయిక్‌ రేట్‌తో 239 పరుగులు చేశాడు.అలా ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్స్​ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియా కప్‌-2022లోనూ అదే హహా కొనసాగించిన సూర్యకుమార్​ 5 మ్యాచ్‌ల్లో 163.52 స్ట్రయిక్‌ రేట్‌తో 139 పరుగులు సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details