ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాలబారిన పడి పర్యటనకు దూరమైన నేపథ్యంలో వారి స్థానంలో మరో ముగ్గురు క్రికెటర్లు యూకేకు బయల్దేరనున్నారు. గాయాల వల్ల శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్లు ఇంగ్లాండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు. వీరిస్థానంలోనే.. శ్రీలంకతో వన్డేసిరీస్‌లో రాణించిన బ్యాట్స్మెన్లు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు తోడు ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
అయితే శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్య, పృథ్వీషాలను సిరీస్ ముగిసిన తర్వాత లేదా మధ్యలోనే యూకేకు పంపించాలా అనే విషయమై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఇంగ్లాండ్-టీమ్ఇండియా ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్ట్ సిరీస్ ఆడనుంది.