గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ తనను స్లెడ్జింగ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్. ముంబయి ఇండియన్స్ ఇన్‌స్టా ఖాతాలో లైవ్ చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"లక్ష్య ఛేదనలో నేను గెలిచాను. కోహ్లీ నా వికెట్ కోసం రెచ్చగొట్టాలని చూశాడు. కానీ, ప్రశాంతంగా నా పని నేను కానిచ్చాను. అతడు నన్ను మాత్రమే కాదు.. ఆ సమయంలో ఎవరినైనా అలానే చేసేవాడేమో. విరాట్ నన్ను స్లెడ్జ్ చేసినందుకు సంతోషంగా అనిపించింది. నేను గొప్పగా ఆడుతున్నాను కాబట్టే నా వికెట్ కోసం నన్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అదే జరిగితే రన్‌రేట్ మందగించి మేము ఓడిపోయే అవకాశం ఉండేది," అని సూర్యకుమార్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.