Suryakumar Yadav On Modi : 2024 టీ20 వరల్డ్‌కప్ కచ్చితంగా గెలుస్తామని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో ఆదివారం (నవంబర్ 26) రెండో టీ20 సందర్భంగా సూర్య మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్ ఓటమి తమను ఇంకా వెంటాడుతోందని.. ఆరోజు మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్‌రూమ్‌కు ప్రధాని వచ్చి ఓదార్చడం పెద్ద విషయం అని సూర్య అన్నాడు.
"వన్డే వరల్డ్‌కప్ ఓటమి వల్ల అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. కానీ, ఓడినా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మద్దతు ఇచ్చారు. నిజంగా వారికి కృతజ్ఞతలు. ఇలాగే మాకు అండగా ఉండండి. ఫైనల్ మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లం అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నాం. అప్పుడు ప్రధాని నరేంద్రమోదీ మా దగ్గరకు వచ్చారు. ఓటమి నుంచి కోలుకునేందుకు ఆయన మాలో స్ఫూర్తి నింపారు. ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని సూచించారు. దేశ నాయకుడు అలా మాతో సమయం గడపడం గొప్పగా అనిపించింది. ఆయన సూచనలను పాటిస్తాం. ఇక 2024లో జరిగే టీ20 వరల్డ్‌కప్ కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది" అని సూర్య అన్నాడు.
Surya vs Australia 1st T20 : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సూర్య అదరగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో..సూర్య, ఇషాన్ కిషన్ (58 పరుగులు : 39 బంతుల్లో, 2x4, 5x6) తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సూర్య.. ఆసీస్ బౌలర్లలను ఉతికి ఆరేశాడు. అతడు కేవలం 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 80 పురుగులు బాదాడు. 17.4 ఓవర్ వద్ద బెహ్రన్‌డార్ఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో రింకూ సింగ్ (22 పరుగులు, 14 బంతులు, 4 ఫోర్లు) పోరాటంతో భారత్ నెగ్గింది. ఇక 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం, కేరళ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపుమీదున్న భారత్.. రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని యువ భారత్- బోణీ కోసం అసీస్ ప్రయత్నం!
స్పిన్నర్ డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ - చూస్తే నవ్వు ఆపుకోలేరు -నెట్టింట వీడియో వైరల్