Suresh raina T20 league : టీమ్ఇండియా స్టార్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెట్‌ర్ సురేశ్ రైనా కొత్త లీగ్‌లోకి దిగబోతున్నాడు. అతడు శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) వేలంలో నిలిచాడు. ఈ లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ కోసం బిడ్డింగ్ ప్రక్రియ జూన్ 14న జరగనుంది. దీని కోసం వేలంలో పాల్గొనే దేశీ, అంతర్జాతీయ క్రికెటర్ల లిస్ట్‌ను లంక క్రికెట్ బోర్డు రిలీజ్ చేసింది. అందులో రైనా పేరు ఉంది. అతడి బేస్‌ప్రైస్ 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు)అని సమాచారం.
రైనా ఒక్కడే..
Lanka premier league 2023 : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆసీస్ క్రికెటర్ మాథ్యూవేడ్, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. అయితే ఇప్పటివరకు ఈ లంక ప్రీమియర్ లీగ్ బరిలో భారత్ తరఫున ఆడింది ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే. ఒక వేళ ఇప్పుడు రైనాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే.. ఈ లీగ్‌లో ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. కాబట్టి సీనియర్ అయిన ఈ ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగులు చేస్తుందో చూడాలి..
Suresh raina ipl stats : 2022లో అని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సురైన్ రైనా.. ఆ తర్వాత విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. 2008-21 మధ్య ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రైనా. అయితే యూఏఈలో జరిగిన 2020 సీజన్ నుంచి అతడు తప్పుకున్నాడు. దీంతో అతడిని చెన్నై తిరిగి జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత అతడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తంగా కెరీర్లో 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రైనా 5500 పరుగులు చేశాడు. చెన్నై కింగ్స్‌తో పాటు గుజరాత్ లయన్స్‌కు కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు.