తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అతడే నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌' - ధోనీ బౌలింగ్​ గురించి సురేశ్​ రైనా

Suresh Raina CSK : ఐపీఎల్‌ చరిత్రలో మంచి ఫామ్​లో నిలిచి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు మాజీ ప్లేయర్​ సురేశ్​ రైనా. చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు తరఫున ఆడిన ఈ ప్లేయర్.. తన సుదీర్ఘ కెరీర్​లో మైదానంలో తనదైన స్టైల్​లో చెలరేగిన ఈ ప్లేయర్​.. నెట్స్‌లో మాత్రం ఒకరి బౌలింగ్​కు ఇబ్బంది పడ్డాడట. ఇంతకీ అతడు ఎవరంటే ?

Suresh Raina about dhoni
Suresh Raina

By

Published : Jun 28, 2023, 7:00 AM IST

Raina About Dhoni : ఐపీఎల్‌ లీగ్స్​లో పరుగుల వరదను పారించి యెల్లో టీమ్​లో కీలక ప్లేయర్​గా నిలిచాడు చిన్నతలా సురేశ్​ రైనా. ధోనీకి ఓ సపోర్ట్​ సిస్టంలా ఉన్న ఈ టీమ్​ఇండియా మాజీ ఆటగాడు.. చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. జట్టు గెలుపు కోసం తన వంతు కృషి చేశాడు. రిటైర్మెంట్​ అయ్యి చాలా కాలం అయినప్పటికీ తన ఆటతో అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశాడు. అయితే మైదానంలో బాల్​ అంటే భయం లేకుండా చెలరేగిపోయే ఈ ప్లేయర్​ను ఓ బౌలర్‌ నెట్స్‌లో భయపెట్టాడట. అతడు మరెవరో కాదు మన కెప్టెన్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ.

ప్రాక్టీస్​ సమయంలో మలింగా, మురళీధరన్‌ బౌలింగ్​కు పెద్దగా ఇబ్బంది పడలేదని.. కానీ, ధోనీ బౌలింగ్‌లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని ఈ మిస్టర్‌ ఐపీఎల్‌ ఓ సందర్భంగా పేర్కొన్నాడు. అతడు ఇటీవలే జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తనను ప్రాక్టీస్‌లో ఎవరైనా ధోనిని అవుట్‌ చేస్తే సరదాగా ఉంటాడని పేర్కొన్నాడు.

Dhoni Bowling : "నేను మురళీధరన్‌, మలింగా బౌలింగ్‌ కష్టంగా ఉంటుందని అనుకున్నాను. కానీ, ధోని బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడ్డాను. ఒక్కసారి అతడు మిమ్మల్ని ఔటు చేస్తే.. మీరు నెలన్నర పాటు అతడి పక్కన కూర్చోలేరు. ఎందుకంటే.. మిమ్మల్ని ఎలా ఔటు చేశాడన్న విషయాన్ని పదే పదే గుర్తుచేస్తుంటాడు. అతడు ఆఫ్‌స్పిన్‌, మీడియం పేస్‌, లెగ్‌స్పిన్‌ ఇలా అన్ని రకాల బంతులు వేయగలడు. అతడు నో బాల్స్‌ వేసినా సమర్థించుకోగలడు. ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేశాడు" అని రైనా వెల్లడించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన ధోనీ.. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 96 బంతులు వేసి 67 పరుగులు ఇచ్చుకొన్నాడు. ఇక 350 వన్డేల్లో ఆరు ఓవర్లు వేసి ఒక వికెట్‌ సాధించాడు. అయితే టీ20ల్లో మాత్రం ధోనికి బౌలింగ్‌ చేసే అవకాశం మాత్రం రాలేదు.

Suresh Raina Career : చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ధోనీ-రైనా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ ముగించిన కొన్ని గంటల్లోనే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతను ఆడిన 193 ఐపీఎల్‌ మ్యాచుల్లో 5,368 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్టులో తొలుత సభ్యుడిగా ఉన్న రైనా.. ఆ తర్వాత ధోనీతో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. 2005లో వన్డే క్రికెట్‌ అరంగేట్రం చేసి.. మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details