ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ మెగా టోర్నీ షురూ కానుంది. అయితే ఐపీఎల్ అనగానే గత రెండు సీజన్ల నుంచి ధోనీ ఈ మెగాటోర్నీకి వీడ్కోలు పలుకుతాడా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు అతడు ఆడుతూనే ఉన్నాడు. కొంతకాలం క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. తాజా సీజన్ కోసం ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించేశాడు. అయితే ఎప్పుటిలాగే ఈ 16వ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం సాగుతోంది. క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయాన్ని సురేశ్ రైనా దృష్టికి తీసుకెళ్లగా.. అతడు దీనిపై అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో అతడు మాట్లాడుతూ.. మహీ వచ్చేసీజన్లోనూ తప్పకుండా ఆడతాడని స్పష్టతనిచ్చాడు.
"ఐపీఎల్ 2024 సీజన్లోనూ మహీ ఆడాలని కోరుకుంటున్నాను. అయితే, అతడి ఉద్దేశం ఏంటనేది మనకు క్లారిటీ లేదు. తెలీదు. అతడు బ్యాటింగ్ ఇంకా బాగానే చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌లోనూ అతడు సూపర్. అయితే, ఈ సీజన్లో ధోనీ ప్రదర్శనపై.. వచ్చే సీజన్లో ఆడాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏడాది నుంచి ఆడని ధోనీకి సవాల్ తప్పదు. అలాగే అంబటి రాయుడుకు కూడా. అయినా టీమ్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా మంది య్ంగ్ ప్లేయర్స్ తామెంటో నిరూపించుకుంటున్నారు. డేవన్ కాన్వే, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్, బెన్ స్టోక్స్.. ఇలా అనుభజ్ఞులు, యువకులతో కూడిన టీమ్ రెడీగా ఉంది. అయితే వారందరూ ఎలా ఆడతారో చూడాలి" అని రైనా చెప్పుకొచ్చాడు.