తెలంగాణ

telangana

ETV Bharat / sports

Suresh Raina: రైనాకు ఆ దేశ ప్రతిష్ఠాత్మక అవార్డు - suresh raina stats

Suresh Raina: మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'స్పోర్ట్స్ ఐకాన్'​ అవార్డుకు ఎంపికయ్యాడు భారత మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా. 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడగా.. రైనాను ఈ అవార్డు వరించింది.

By

Published : Mar 20, 2022, 9:48 AM IST

Suresh Raina: భారత మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనాను ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్'​ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు శ్రీలంక క్రికెట్​ దిగ్గజం సనత్​ జయసూర్య, జమైకా స్ప్రింటర్​ పోవెల్​, డచ్​ ఫుట్​బాల్​ ఆటగాడు ఎడ్గర్​ డెవిడ్స్​ సహా 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఈ అవార్డును బంగ్లాదేశ్​ క్రీడామంత్రి జహీర్ హసన్​ రసెల్​.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు.

మరోవైపు, ఐపీఎల్​ మెగావేలంలో సురేశ్​ రైనాను కొనుగోలు చేయకపోవడంపై శ్రీలంక మాజీ ఆటగాడు, రాజస్థాన్​ రాయల్స్​ డైరెక్టర్​ కుమార సంగక్కర స్పందించాడు. 'రెడ్​బుల్​ క్రికెట్'​ కార్యక్రమంలో పాల్గొన్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

"దీనిని అనేక రకాలుగా చూడొచ్చు. కాలం గడుస్తున్న కొద్ది కొత్త ఆటగాళ్లు వస్తుంటారు. సురేశ్​ రైనా ఒక దిగ్గజ ఆటగాడు. ఐపీఎల్​లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ప్రతీ సీజన్​లోనూ మెరుగ్గా రాణించాడు. ఈ సీజన్​కు సరిపోకపోవచ్చు కానీ అతడిలో ఆటగాడికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. వాటి కోసమే విశ్లేషకులు, యాజమాన్యాలు వెతుకుతున్నాయి."

-కుమార సంగక్కర, రాజస్థాన్​ రాయల్స్​ డైరెక్టర్

ఐపీఎల్​లో చైన్నై సూపర్​ కింగ్స్ జట్టు నాలుగు సార్లు కప్పు గెలవడంలో సురేశ్​ రైనా కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్​లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి:IPL 2022: ఐపీఎల్​లోకి రైనా.. ఈసారి కొత్త అవతారంలో

ABOUT THE AUTHOR

...view details