తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందరూ వాళ్ల గురించే మాట్లాడతారు - కానీ రైనాను మర్చిపోకూడదు : అశ్విన్

Suresh Raina Birthday : టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. తన కెరీర్​లో జట్టుకు అనేక విజయాలు అందించాడు. సోమవారం (నవంబర్ 27)న రైనా బర్త్​డే సందర్భంగా అతడి కెరీర్​లోని కొన్ని విశేషాలు..

Suresh Raina Birthday
Suresh Raina Birthday

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 10:00 AM IST

Updated : Nov 27, 2023, 11:17 AM IST

Suresh Raina Birthday :టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. 2005లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసి, 13 ఏళ్లుకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్​లో అనేక రికార్డులు కొల్లగొట్టి తక్కువ కాలంలోనే అత్యుత్తమ బ్యాటర్​గా ఎదిగాడు. ఐపీఎల్​ల్లో అనేక సీజన్​లు నిలకడగా రాణించి.. మిస్టర్ ఐపీఎల్​గా పేరొందాడు సురేశ్ రైనా. సోమవారం (నవంబర్ 27)న రైనా బర్త్​డే సందర్భంగా అతడి కెరీర్​లోని కొన్ని విశేషాలు..

మెరుపు బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్​తో రైనా మైదానంలో ఆల్​రౌండ్ ప్రదర్శన చేశేవాడు. బ్యాటింగ్​లో రైనా సిగ్నేచర్ షాట్'ఇన్​సైడ్ ఔట్​' ​కు అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2011లో వరల్డ్​కప్ నెగ్గిన టీమ్ఇండియా జట్టులో రైనా సభ్యుడు కూడా. అయితే రైనా ఆ మెగాటోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్​ ఆడాడని.. కానీ, వాటి గురించి ఎవరూ మాట్లాడుకోరని స్పిన్నర్ రవిచంద్రన్ గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పాడు.

"2011 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్​, మొహాలీలో జరిగిన సెమీఫైనల్​లో భారత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. రైనా వచ్చి గేమ్​ను మా వైపు మలిచాడు. ఆ ప్రపంచకప్​ గురించి చర్చకు వస్తే.. మనం యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సచిన్ తెందూల్కర్ ఇన్నింగ్స్​లు.. బౌండరీలతో స్కోర్​ బోర్డును ప్రారంభించే వీరేంద్ర సేహ్వాగ్​ గురించి మాట్లాడుకుంటాం. కానీ, ఆ వరల్డ్​కప్​లో సురేశ్ రైనా పోరాటం మర్చిపోకూడదు" అని అశ్విన్ అన్నాడు. కాగా, 2011 ప్రపంచకప్ క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాపై రైనా 28 బంతుల్లో 34*, సెమీస్​లో పాకిస్థాన్​పై 39 బంతుల్లో 36*పరుగులతో రాణించాడు.

రైనా కెరీర్​లో మరిన్ని ఘనతలు..

  • టీమ్ఇండియాకు టీ20ల్లో చిన్న వయసులో కెప్టెన్సీ చేసిన ప్లేయర్ రైనా. అతడు 23 ఏళ్లకే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
  • ఐపీఎల్​లో 3000 పరుగుల మార్క్​ను అందుకున్న తొలి బ్యాటర్ రైనా. ఐపీఎల్​లో రైనా అత్యంత నిలకడ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
  • ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​లు అందుకున్న ఫీల్డర్​ రైనా. అతడు 171 క్యాచ్​లు పట్టాడు. ఐపీఎల్​లో 100 సిక్స్​లు బాదిన తొలి భారత బ్యాటర్ కూడా రైనా.
  • అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన తొలి టీమ్ఇండియా ప్లేయర్ రైనా.

రిటైర్మెంట్​లోనూ వీడని ఫ్రెండ్​షిప్.. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు..

Asia Cup Best Partnership : ధోనీ -రైనా.. ధావన్​- రోహిత్​.. ఆసియా కప్​లో బెస్ట్ పార్టర్న్​షిప్స్​ ఇవే!

Last Updated : Nov 27, 2023, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details