తెలంగాణ

telangana

ETV Bharat / sports

Women's T20 Challenge: చెలరేగిన పూజ.. మంధాన సేన చిత్తు - స్మృతి మంధాన

Women's T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్​ ఆరంభ మ్యాచ్​లో ట్రయల్​బ్లేజర్స్​ను చిత్తు చేసింది హర్మన్​ప్రీత్​ కౌర్​ సారథ్యంలోని సూపర్​నోవాస్​. 164 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంధాన సేనను.. 114/9 పరుగులకే కట్టడిచేసింది.

supernovas vs trailblazers
Women's T20 Challenge

By

Published : May 23, 2022, 11:39 PM IST

Women's T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్​లో తొలి మ్యాచ్​లోనే ఢిఫెండింగ్​ ఛాంపియన్ ట్రయల్​బ్లేజర్స్​కు షాకిచ్చింది సూపర్​నోవాస్​. 22 ఏళ్ల పేసర్​ పూజా వస్త్రాకర్​ 4 వికెట్లతో చెలరేగిన వేళ 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్​ స్మృతి మంధాన (34) సహా మరో ఓపెనర్​ హేలీ మ్యాథ్యూస్ (18), సోఫియా (1), సల్మా ఖతూన్ (0)​ల వికెట్ల తీసి.. సూపర్​నోవాస్​ విజయంలో కీలక పాత్ర పోషించింది పూజ. దీంతో 114/9 పరుగులకే పరిమితమైంది ట్రయల్​బ్లేజర్స్.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన సూపర్​నోవాస్​.. 163/10 పరుగులు చేసింది. ఇది టోర్నీలోనే అత్యధిక స్కోరు. ప్రియా పూనియా (22), డాటిన్ (32), హర్లీన్ దేవోల్​ (35), హర్మన్ ప్రీత్ కౌర్​ (37) రాణించారు. ట్రైయల్​బ్లేజర్స్​ బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ 3, సల్మా ఖతూన్ 2​, పూనమ్ యాదవ్, గైక్వాడ్​ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​కు కొత్త రూల్స్.. వర్షం పడితే సూపర్​ ఓవర్​

ABOUT THE AUTHOR

...view details