"రెండోదశ సీజన్లో బాగా ఆడేందుకు కృషి చేస్తాం. భారత్‌లో జరిగిన ఫస్టాఫ్‌లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాం. ఈ సీజన్‌ను మెరుగ్గా ముగించడంపై దృష్టిపెట్టాం. ప్రతి మ్యాచ్‌ను ఫైనల్లా భావించి పోరాడుతాం. గత ఏడాదిన్నర నుంచి బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా. దీనికోసం ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేయడం లేదు. కానీ శక్తిమేర రాణించాలని అనుకుంటున్నా" అని రషీద్ చెప్పాడు.
తొలి దశలో ఏడు మ్యాచ్‌లాడి ఒక్కటే దానిలో గెలిచిన సన్‌రైజర్స్.. ఇప్పుడు ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. లేదంటే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడం అసాధ్యం. బహుశా అందువల్లనే రషీద్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.