Sunrisers Hyderabad New Head Coach 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. తమ హెడ్ కోచ్‌లను మార్చగా.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్‌ను మార్చేసింది. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డేనియల్ వెట్టోరిని నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారాపై వేటు వేస్తూ.. ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
Daniel Vettori Coaching Career : డేనియల్ వెట్టోరి గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అదే ఆర్సీబీ జట్టుకు 2014 - 2018 మధ్య సీజన్లలో హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. వెట్టోరి నేతృత్వంలో ఆర్సీబీ 2015లో ప్లేఆఫ్స్ చేరగా.. 2016లో ఫైనల్స్ దాకా వెళ్లింది. అయితే ఈ రెండు సీజన్ ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడింది. కాగా ప్రస్తుతం వెట్టోరి ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెట్టోరి బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బర్బాడోస్ రాయల్స్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.