Sunil Narine KKR: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సాధించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌తో కలిపి 11 సార్లు కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్.. రూ. 100 కోట్ల శాలరీ మార్క్‌ను అందుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ సీజన్ 15 నేపథ్యంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ సునీల్ నరైన్‌ను రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ జాబితాను ప్రకటించకముందే.. 10 సీజన్లు కలిపి సునీల్ నరైన్ రూ. 95.6 కోట్ల శాలరీ పొందాడు. వచ్చే సీజన్ సంపాదన రూ. 6 కోట్లతో కలిపి నరైన్ రూ. 100 కోట్లు పొందిన క్లబ్లో చేరాడు.
2012లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన నరైన్ 134 మ్యాచ్‌లు ఆడాడు. 143 వికెట్లు తీశాడు. 958 పరుగులు చేసి అనేక సందర్భాల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలి ప్లేయర్ ఏబీనే..
ఐపీఎల్లో రూ. 100 కోట్లు సంపాదించిన తొలి విదేశీ ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ రికార్డు సృష్టించాడు.
ఐదుగురే..