తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ టెస్టు జట్టులా లేదు: గావస్కర్​ - టీమ్​ఇండియా ఇంగ్లాండ్​ సిరీస్​

ఇంగ్లాండ్​ ఇద్దరు ఆటగాళ్ల జట్టు అని అన్నాడు టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. జట్టులో కెప్టెన్​ జో రూట్​, పేసర్​ అండర్సన్​ మినహా మిగతా వారు పేలవంగా ఆడుతున్నారని తెలిపాడు.

sunil
సునీల్​

By

Published : Aug 18, 2021, 5:31 AM IST

ఐదు టెస్టుల సిరీస్​లో ఇంగ్లాండ్​ను భారత జట్టు 4-0 లేదా 3-1తేడాతో ఓడిస్తుందని ఈ సిరీస్​కు ముందు భారత దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ అంచనా వేశాడు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్​కు అంతరాయం కలిగితే తాను చేసేది ఏమీ లేదని అన్నాడు. ​

లార్డ్స్​ వేదికగా ఆగస్టు 16న ముగిసిన రెండో టెస్టులో టీమ్​ఇండియా చిరస్మరణీయ విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్ ఈ విధంగా స్పందించాడు.

"ఇంగ్లాండ్​ ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్ల జట్టు. బ్యాటింగ్​లో జో రూట్​, బౌలింగ్​లో అండర్సన్​ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. మిగతావాళ్లు నామమాత్రంగా ఆడుతున్నారు. ఇది సరైన టెస్టు జట్టుగా అనిపించడం లేదు. వారి ఓపెనర్ల బ్యాటింగ్​ టెక్నిక్​ మరీ పేలవంగా ఉంది. మూడో స్థానంలో హమీద్​ ఒత్తిడితో ఆడుతున్నాడు. రూట్​ ఒక్కడే అద్భుతంగా రాణిస్తున్నాడు. బట్లర్​ వన్డే, టీ20 ప్లేయర్​. టెస్టు​ ఆటగాడని​ కచ్చితంగా చెప్పలేను. బౌలింగ్​లో అండర్సన్​ ఒక్కడే రాణిస్తున్నాడు. మొత్తంగా ఇంగ్లాండ్​ ఇద్దరు ఆటగాళ్ల జట్టు. నేను సిరీస్​ ఆరంభానికి ముందే చెప్పా.. టీమ్​ఇండియా 4-0 లేదా 3-1తేడాతో సిరీస్​ గెలుస్తుందని. ఇప్పటికీ అదే నమ్ముతున్నా. వర్షం పడి మ్యాచ్​లకు అంతరాయం కలగకపోతే నా అంచనా నిజం కావొచ్చు."

-గావస్కర్​, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​.

ఇరు జట్ల మధ్య ఆగస్టు 25 నుంచి మూడో టెస్టు జరగనుంది. హెడింగ్లే వేదికగా ఈ పోరులో తలపడనున్నాయి రెండు జట్లు.


ఇదీ చూడండి:'ఇంగ్లాండ్‌ భయపడిందని అప్పుడే అర్థమైంది'

ABOUT THE AUTHOR

...view details