తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గెలవడం కోసం కాదు డ్రా చేస్తే చాలనుకున్నారు' - IND vs NZ 1st test news

Gavaskar Slams NZ: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో కివీస్​ బ్యాటింగ్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. గెలవాలని కాకుండా, డ్రాగా ముగిస్తే చాలని ఆడటం సరికాదని అన్నాడు.

sunil gavaskar
సునీల్ గావస్కర్

By

Published : Nov 30, 2021, 2:40 PM IST

Gavaskar Slams NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​ డ్రా అవ్వడంలో కివీస్​ ఆటగాళ్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించారు. అయితే.. భారత్​ విధించిన టార్గెట్​ను ఛేదించడం కాకుండా వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారంటూ న్యూజిలాంట్ జట్టు బ్యాటింగ్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్. డ్రాగా ముగించేందుకే ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించాడు.

"భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో ఇన్నింగ్స్​ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఐదో రోజు భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వికెట్లు కోల్పోతుండటం మొదలవ్వగానే కివీస్​పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ కివీస్​ గెలవడానికి ప్రయత్నించకుండా, డ్రాగా ముగించడంపైనే ధ్యాసపెట్టింది."

-సునీల్ గావస్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

లాథమ్​, విల్లే శుభారంభం ఇచ్చినా..

IND vs NZ 1st test: "రెండో ఇన్నింగ్స్​ ప్రారంభమయ్యాక లాథమ్​, సోమర్​ విల్లే కివీస్​ జట్టుకు శుభారంభం ఇచ్చారు. ఐదో రోజు లంచ్​ విరామం సమయానికి.. టీమ్​ఇండియా కెప్టెన్​ రహానే, హెడ్​ కోచ్ ద్రవిడ్​ మ్యాచ్ చేజారిపోతుందేమో అని కూడా అనుకొని ఉండొచ్చు. కానీ, తర్వాత సీన్​ మారిపోయింది. కివీస్​ కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్​ డ్రా చేస్తే చాలనే పరిస్థితికి వచ్చింది" అని గావస్కర్ అన్నాడు.

ఇదీ చదవండి:

IND vs NZ Test: డ్రాగా ముగిసిన భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు

IND vs NZ 2nd Test: కరోనా ఎఫెక్ట్​- పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు

ABOUT THE AUTHOR

...view details