Sunil Gavaskar Mumbai plot:మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తిరిగి ఇచ్చేశారు. క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు మహారాష్ట్ర హౌజింగ్ ఏజెన్సీ(ఎంహెచ్ఏడీఏ) ముంబయిలోని బాంద్రాలో 33 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఇది నిరుపయోగంగానే ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జితేంద్ర అవ్హాద్.. గతేడాది సునీల్ గావస్కర్‌కు లేఖ రాశారు. బాంద్రాలో కేటాయించిన ప్లాట్ నిరుపయోగంగా పడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్లాట్‌ను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.
క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్
Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్‌ను రిటర్న్ ఇచ్చారు.
Sunil Gavaskar cricket academy:అయితే, క్రికెట్ అకాడమీ నెలకొల్పాలని సునీల్ గావస్కర్ ఇదివరకే పలు ప్రయత్నాలు చేశారు. సచిన్ తెందూల్కర్‌తో కలిసి అకాడమీ అభివృద్ధి కోసం ఓ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మేరకు ఠాక్రే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దురదృష్టవశాత్తు అవేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌కు మంత్రి జితేంద్ర లేఖ రాశారు. ఎనిమిది నెలల చర్చల అనంతరం ప్లాట్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తాను క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయలేనని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఐసీసీ ర్యాంకింగ్స్.. టీ20ల్లో మనమే టాప్.. టెస్టులు, వన్డేల్లో ఇలా..