Sunil Gavaskar on Rohit: రోహిత్ శర్మ ఇటీవలే టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్ల సారథిగా ఎంపికయ్యాడు. దీంతో రాబోయే రోజుల్లో అతడు పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇకపై తీరిక లేని క్రికెట్ కారణంగా ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవడం కెప్టెన్‌గా రోహిత్‌కు సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నాడు. ఈ విషయంలో జట్టు యాజమాన్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు.
'బిజీ షెడ్యూల్‌లో టీమ్‌ఇండియా.. రోహిత్‌కు అతిపెద్ద సవాలు'
Sunil Gavaskar on Rohit: టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశముందని మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సవాలుతో కూడున్న పని అని పేర్కొన్నాడు.
"బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సమస్య. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్‌ఇండియాతో పాటు అన్ని జట్లూ తీరిక లేకుండా ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి. వచ్చేనెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్ ఉంటుంది. ఆపై దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లతో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. ఇలా ఊపిరి సడలని షెడ్యూల్ ఉండటం వల్ల ఆటగాళ్లు తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రోహిత్, జట్టు యాజమాన్యం ఎలా సమన్వయం చేసుకుంటారనేదే సమస్య" అని గావస్కర్ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.