Sunil Gavaskar Team India: టీమ్‌ఇండియాలో తాజా పరిస్థితులపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. జట్టుకు ప్రధాన కోచ్ ఉండగా మరో బ్యాటింగ్ కోచ్ వారితో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకన్నా సపోర్ట్ స్టాఫ్ ఎక్కువవుతున్నారని.. క్లిష్ట సమయంలో అది జట్టును గందరగోళానికి గురిచేసే అవకాశముందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న సందర్భంగా ఈ విధంగా స్పందించాడు.
'ద్రవిడ్ ఉండగా మరో కోచ్ ఎందుకు? జట్టులో ఆటగాళ్లకన్నా వారే ఎక్కువ!' - సునీల్ గావస్కర్ ద్రవిడ్
Sunil Gavaskar Team India: టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ ఓటమిపై విశ్లేషించిన సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకన్నా సపోర్ట్ స్టాఫ్ ఎక్కువవుతున్నారని.. క్లిష్ట సమయంలో అది జట్టును గందరగోళానికి గురిచేసే అవకాశముందని తెలిపాడు. ఇంకేమన్నాడంటే.
!['ద్రవిడ్ ఉండగా మరో కోచ్ ఎందుకు? జట్టులో ఆటగాళ్లకన్నా వారే ఎక్కువ!' Sunil Gavaskar Team India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16924871-thumbnail-3x2-eee.jpg)
"టీమ్‌ఇండియాకు హెడ్ కోచ్‌గా బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉండగా.. బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు. అతడు ఒకటి చెప్పడం.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ మరోటి చెప్పడం వల్ల బ్యాటర్లు గందరగోళానికి గురవుతారు. ఈ విషయాన్ని ఇకనైనా అర్థం చేసుకోవాలి. మీకు సపోర్ట్ స్టాఫ్ ఎక్కువ వద్దనుకుంటే వారిని జట్టుతో పర్యటనకు పంపకండి. కీలకమనుకున్న వారినే తీసుకెళ్లండి. 1983 ప్రపంచకప్ సమయంలో మా వెంట ఒకే ఒక్క మేనేజర్ ఉండేవాడు. 1985 టోర్నీలోనూ ఒక్కరే ఉన్నారు. 2011లో కప్పు గెలిచినప్పుడు సైతం పరిమిత సంఖ్యలోనే సపోర్ట్ స్టాఫ్ ఉండేవారు. వీరి సంఖ్య ఎక్కువైతే ఎవరి సూచనలు వినాలో తెలియక ఆటగాళ్లు ఇబ్బందిపడతారు" అంటూ గావస్కర్ పేర్కొన్నాడు.