తెలంగాణ

telangana

ETV Bharat / sports

సునీల్ గావస్కర్, రోహిత్ శర్మ మెంటర్ మృతి - క్రికెట్ న్యూస్

టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్​సర్కార్, రోహిత్ శర్మల మెంటర్​ వాసు పరంజేపే అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. ఈయన మృతి పట్ల క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Vasu Paranjape passes away
వాసు పరంజేపే

By

Published : Aug 31, 2021, 8:17 AM IST

క్రికెటర్​గా, కోచ్​గా ముంబయి జట్టుకు సేవలందించిన కోచ్ వాసు పరంజేపే(82) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు దిగ్గజ సచిన్ తెందూల్కర్.

ఆరు దశాబ్దాల కెరీర్​లో ముంబయి క్రికెట్ అసోసియేషన్​లో కోచ్​, సెలెక్టర్, మెంటర్​.. ఇలా అన్ని విధాలుగా ఎంతోమంది క్రికెటర్లు అండగా నిలిచారు. సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్​సర్కార్, సంజయ్ మంజ్రేకర్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లకు మెంటర్​గా బాధ్యతలు నిర్వర్తించి, వాళ్ల కెరీర్​ ఎదుగుదలలో తోడ్డాటు అందించారు.

పరంజేపే కుమారుడు కూడా జాతీయ మాజీ సెలెక్టర్​గా, క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details