SRH Asst Coach Resign: ఐపీఎల్ ఆరంభం కాకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు సహాయ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి గల స్పష్టమైన కారణాన్ని కటిచ్ వెల్లడించలేదు. 2022 మెగా వేలంలో జట్టు తీసుకున్న నిర్ణయాలే.. రాజీనామాకు కారణమని తెలుస్తోంది.
మెగా వేలంలో హైదరాబాద్ జట్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను కటిచ్ అంగీకరించలేదు. జట్టు మాజీ కెప్టెన్ డెవిడ్ వార్నర్ రాజీనామాను ఫ్రాంఛైజీ పట్టించుకోకపోవడం వల్ల కూడా కటిచ్ యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నారు.
ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఆటగాడు టామ్ మూడీ సన్‌రైజర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
2021 ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గతేడాది 14మ్యాచులాడిన ఎస్ఆర్హెచ్ మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సీజన్‌ను ముగించింది. జట్టు కెప్టెన్ డెవిడ్ వార్నర్‌ను అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించింది. టోర్నమెంట్ మధ్యలో పక్కకు పెట్టింది.
ఈ సారి జరిగిన మెగావేలంలో రూ.10.75 కోట్లు వెచ్చించి విండీస్ ఆటగాడు నికోలస్ పురన్ను ఎస్ఆర్హెచ్ కొనుక్కుంది. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు రూ.8.75 కోట్లు వెచ్చించింది. రోమారియో షెపర్డ్, నటరాజన్, మక్రమ్, సీన్ అబాట్. రాహుల్ త్రిపాఠి. గ్లెన్ పిలిప్స్లను వేలంలో దక్కించుకుంది. ఐపీఎల్ వేలానికి ముందే కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రన్ మాలిక్‌లను రిటెయిన్ చేసుకుంది.
ఇదీ చదవండి:IPL: 'మహీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు.. అందుకే అలా'