Stuart Broad Retirement : ఇంగ్లాండ్ దిగ్గజ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన అభిమావనులతో పాటు క్రికెట్ లవర్స్‌కు చేదు వార్తను అందించాడు. 2006 నుంచి ఇప్పటి వరకు 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఆడిన ఈ స్టార్.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ తన కెరీర్‌కు ఓ బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఓ సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్‌గా స్టువర్ట్ ఎదిగిన తీరు.. ఎంతో మందికి స్పూర్తిదాయకం.
Stuart Broad Career : నాటింగ్‌హామ్‌లో 1986 జూన్ 24న బ్రాడ్ జన్మించాడు. అయితే తన తల్లికి నెలల నిండకముందే కేవలం 907 గ్రాముల ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టాడు. దీంతో పుట్టిన క్షణమే అతను మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడ్డాడు. దీంతో దాదాపు నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో స్టువర్ట్‌ను ఇంక్యుబేటర్‌లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికీ ఆరోగ్యం కాస్త మెరుగుపడినప్పటికీ.. ఊపిరితిత్తుల సమస్య మాత్రం అలానే ఉండిపోయింది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల వల్ల బ్రాడ్ ఊపిరితిత్తుల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. అందుకే ఇప్పటికీ అతను ఆస్తమాతో బాధపడుతున్నాడు.
అరంగేట్ర మ్యాచ్‌లో కీలక వికెట్లు.. 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు..
Stuart Board Records :2005లో లీసెస్టర్‌షైర్ తరపున తన ఫాస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించిన బ్రాడ్.. 2008లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 264 మ్యాచ్‌లు ఆడిన స్టువర్ట్.. 948 వికెట్లు పడగొట్టాడు. 20 సార్లకు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించి రికార్డుకెక్కాడు. ఆ తర్వాతి సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రాడ్.. తన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ పడగొట్టాడు. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. అయితే అదే ఏడాది పాకిస్థాన్ జట్టుపై టీ20 డెబ్యూ చేశాడు. ఈ క్రమంలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు.
ఇక 2007లో టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టువర్ట్.. తన అరంగేట్ర మ్యాచ్ నుంచి ఇంగ్లీష్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చాడు. అయితే 2016లో వైట్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్న స్టువర్ట్.. తన చివరి వన్డే మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు.కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా బ్రాడ్ బాధ్యతలు వహించాడు.